మళ్లీ అదే తప్పు చేస్తున్న నాగ చైతన్య!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఓ సినిమా రూపొందు తున్న విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే యడాది విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శేరవెగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం తర్వాత నాగచైతన్య చేయవలసిన సినిమా ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవడం అక్కినేని అభిమానులను నిరుత్సాహపరుస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాను చేయడానికి ఈ రంగం సిద్ధం చే యడం విశేషం. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగచైతన్య తన తదుపరి సినిమా గా ఓ పొలిటికల్ నేపథ్యం లోని చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నారట. ఇటీ వల విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన వేణు ఊడుగుల తాజాగా ఓ పొలిటికల్ నేపథ్యంలోని సినిమా నాగచైతన్య కు చేప్పగా ఆయన దానికి సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. 

ప్రేమ కథ చిత్రాలపై మాస్ మసాలా చిత్రాలపై ఫోకస్ పెట్టాల్సింది పోయి నాగచైతన్య ఈ విధంగా పొలిటికల్ నేపథ్యంలోని సినిమాలను చేయాలని అనుకోవడం నిజంగా ఆయన కెరీర్ కు అంత మంచిది కాదని చాలామంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో నాగచైతన్య చేసిన ఓ పొలిటికల్ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆలచించలేకపోయింది. దేవకట్ట దర్శకత్వం లో నాగ చైతన్య చేసిన ఆటో నగర్ సూర్య చిత్రం ప్రేక్షకుల ముందుకు పొలిటికల్ సినిమాగా రాగా అది వారిని ఏమాత్రం  అలరించలేకపోయింది. ఫలితంగా నాగ చైతన్య కెరియర్లో ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ వచ్చినట్లు అయ్యింది. మరి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు కాబట్టి ఈ సినిమా చేసే విషయంలో నాగచైతన్య మరొకసారి ఆలోచన చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: