కాంతారా డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!

Anilkumar
ప్రస్తుతం ఇప్పుడు  ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కాంతార సినిమా హీరో రిషభ్ శెట్టి.. ఇక ఎన్టీఆర్పై తనకున్న అభిమానాన్ని తెలిపారు. అంతేకాదు అలాగే తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.ఇకపోతే కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అయితే మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇక సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.అయితే  కర్ణాటకలో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులో నేడు(అక్టోబర్ 15న) విడుదలైంది. 

అంతేకాదు ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు. అయితే  ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రిషభ్ శెట్టి.. తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని.. అలాగే తారక్‏కు తనకు మధ్య ఓ కామన్ కనెక్షన్ ఉందని తెలిపారు.కాగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ. అయితే “తెలుగు చిత్రపరిశ్రమలో అనేక మంది హీరోస్ ఉన్నారు. కానీ ఇక  నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇకపోతే అతనితో నాకు మరొక అనుబంధం కూడా ఉంది. అదేంటంటే..  ఇక తారక్ అమ్మగారు కూడా మా గ్రామాం కుందాపూర్కు చెందినవారే” అని చెప్పారు.

 అంతేకాదు అలాగే ‘మీ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తారా’ అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవని, మంచి కథ ఉన్నప్పుడు ఆలోచించుకుంటానని అన్నారు.ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాక.. దక్షిణాది మొత్తం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతోంది.  ఈ సినిమాకు కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించాడు.. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.  సెప్టెంబర్ 30న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. అంతేకాదు అలానే సామాన్యులు మొదలు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: