ధోని నిర్మాతగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా.. ఫాన్స్ కి ఇక పండగే....!!

murali krishna
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు కి పాన్ ఇండియా లెవల్ మంచి క్రేజ్ ఉంది..అదేంటి మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చెయ్యకుండా ఇండియా వైడ్ అంత క్రేజ్ ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు..కానీ మహేష్ బాబు ని మించిన అందగాడు ఇండియా మొత్తం వెతికినా దొరకదు కదా..సోషల్ మీడియా లో ఈ స్థాయిలో వృద్ధి చెందిన రోజుల్లో ఆయనకీ పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ రావడం లో వింత ఏముంది అని అంటున్నారువిశ్లేషకులు..పైగా మహేష్ బాబు సినిమాలు హిందీ లో దబ్ అవ్వగా వాటికి వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ యూట్యూబ్ లో వచ్చాయి..ఇలా అన్ని విధాలుగా మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులర్..పైగా ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్..అలాంటి ఫేమ్ ఉన్న మహేష్ బాబు తో సినిమా తియ్యాలని ప్రతి బాలీవుడ్ అగ్ర నిర్మాతకి ఉంటుంది..కానీ మహేష్ బాబు కి ఇష్టం లేదు.
ఇక అసలు విషయం లోకి వెళ్తే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని త్వరలోనే సినీ నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టబోతున్నాడట..ఈ క్రమం లో ఆయన ద్రుష్టి ఎక్కువగా సౌత్ స్టార్స్ మీదనే పెట్టినట్టు తెలుస్తుంది..అందుతున్న సమాచారం ప్రకారం మహేంద్ర సింగ్ ధోని అతి త్వరలోనే మహేష్ బాబు తో ఒక సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట..దీనికి సంబంధించి ఆయన మహేష్ బాబు తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది..మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ సినిమా హిందీ కి సంబంధించిన రైట్స్ మొత్తం ధోని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట..దానితో పాటు మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత చెయ్యబొయ్యే సినిమా కూడా ధోని ప్రొడక్షన్ హౌస్ నుండే ఉంటుందట..ఇది అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు..మరో పక్క ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..గత కొద్దీ రోజుల క్రితం ధోని చెన్నై లో విజయ్ ని కలిసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన అలా కలవడానికి ముఖ్య కారణం ఇదేనట..క్రికెట్ రంగం లో దిగ్గజం గా నిలిచి ఎవ్వరికి సాధ్యపడని అనితర సాధ్యమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ధోని..సినీ రంగం లో ఎలారాణిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: