వైఎస్ రాజశేఖర్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఎన్టీఆర్ విషయంలో మనం చేసింది తప్పా?.. అన్‌స్టాపబుల్‌ పొలిటికల్ ఎపిసోడ్ కానుందా?

murali krishna
బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీగా హిట్ అయింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు సరికొత్తగా కనపడటంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు.
ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఇది వైరల్ గా మారింది.
గతంలో లాగే ఈ సారి కూడా అన్‌స్టాపబుల్‌ సరదాగా సాగుతుంది. మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా చంద్రబాబు, లోకేష్ తో సరదాగా మాట్లాడారు. సరదా సన్నివేశాలు గుర్తుచేసుకున్నారు. అయితే ఈ ప్రోమోలో వివాదాస్పద రాజకీయ అంశాలు మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మొదట బాలయ్య చంద్రబాబుని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడగగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయనతో కలిసి బాగా తిరిగేవాడినని, మేమిద్దరం కలిసి చాలా అల్లరి పనులు చేశామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మరింత ఎపిసోడ్ లో మాట్లాడనున్నట్టు తెలుస్తుంది.
అలాగే కొంతమంది చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని అంటూ ఉంటారు. దానికి కూడా ఇందులో బాబు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. తన లైఫ్ లో తీసుకున్న పెద్ద నిర్ణయం 1995లో అదే అని, ఆ రోజు జరిగింది నీకు కూడా తెలుసు, ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని అడిగాను కానీ ఆయన వినలేదు, ఆ రోజు మనం చేసింది తప్పా అని బాలయ్యని ఎదురు ప్రశ్నించారు. దీంతో చాలా కాలంగా చంద్రబాబుకి నెగిటివ్ గా ఉన్న ఈ అంశంపై ఎపిసోడ్ లో క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
అలాగే లోకేష్ రావడంతో గతంలో లోకేష్ ఫారెన్ లో అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటో చూపెట్టి అసెంబ్లీ దాకా వెళ్ళింది ఈ ఫోటో అని అడిగారు బాలయ్య. అలాగే మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయావ్ అని కూడా అడిగారు. చివర్లో చంద్రబాబు ఎన్టీఆర్ ఎప్పటికీ నా ఆరాధ్య దైవం, నా గుండెల్లో ఉంటారు అని చెప్పారు. దీంతో ఈ ప్రోమో ఎంటర్టైన్మెంట్ కంటే కూడా పొలిటికల్ గా బాగా వైరల్ అవుతుంది. ఏపీ రాజకీయాల్లో చర్చగా మారయింది ఈ ప్రోమో.
ఇన్నాళ్లు బాబు, లోకేష్ లకు ఉన్న నెగిటివ్స్ ని ఈ ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చి వాటినే తమ పాజిటివ్ పాయింట్స్ గా తిప్పుకునేలా చూస్తున్నారు. ఇన్ని పొలిటికల్ అంశాలు ఉండటంతో ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఒకరకంగా 2024 ఎలక్షన్స్ కి ఒకరకంగా ప్రమోషన్ అని కొంతమంది అంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ గా ఉండబోతుందా, పొలిటికల్ గా చర్చకు దారి తీస్తోందా తెలియాలంటే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే అక్టోబర్ 14 వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: