సూర్య 42వ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య తాను నటించిన తమిళ సినిమా గజిని తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. గజిని సినిమా తర్వాత సూర్య నటించిన దాదాపు అన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో సింగం సిరీస్ మూవీ ల ద్వారా సూర్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
 

ఇది ఇలా ఉంటే సూర్య తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో రోలెక్స్ అనే ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ పాత్రతో సూర్య ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య ,  శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతుంది. దర్శకుడు శివ ఈ మూవీ ని ప్రతిష్టాత్మక పీరియాడికల్ మూవీ గా రూపొందిస్తున్నాడు.

ఈ మూవీ ని సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ ని యు వి క్రియేషన్స్ సంస్థ మరియు గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని పది భాషలలో త్రీడీ వర్షన్ లో రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని నేటితో గోవాలో పూర్తి చేసినట్లు కొద్ది సేపటి క్రితం ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: