'గాడ్ ఫాదర్' సినిమా కోసం.. గెటప్ శ్రీను అంత పారితోషకం తీసుకున్నాడా?

praveen
ఇటీవల కాలంలో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇలా గత కొంతకాలం నుంచి వరుస అవకాశాలతో బిజీ బిజీగా మారిపోయిన కమెడియన్స్ లో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.

కాగా టాలీవుడ్ మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా గెటప్ శ్రీను అవకాశం దక్కించుకున్నాడు. మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో గెటప్ శ్రీను ఒక కీలకపాత్రలో నటించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గెటప్ శ్రీనును చిరంజీవి తన ప్రత్యేకమైన ఫ్లైట్లో తనతో పాటు పక్కనే కూర్చోబెట్టి తీసుకువెళ్లడం... అందుకు సంబంధించిన వీడియో ని గెటప్ శ్రీను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత వైరల్ గా మారిపోయింది.

 ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమా కోసం అటు గెటప్ శ్రీను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. గాడ్ ఫాదర్ సినిమా కోసం గెటప్ శ్రీను ఏకంగా 10 లక్షల వరకు పారితోషకం అందుకున్నాడట. కాగా చిన్న పాత్ర కోసం గెటప్ శ్రీను 10 లక్షలు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా గెటప్ శ్రీను ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. ముఖ్యంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు చొక్కాలు చింపుకోవడానికి రెడీగా ఉండండి అంటూ గెటప్ శ్రీను చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: