వైరల్ అవుతున్న కియారా అద్వానీ అఫైర్ వార్త..!!

murali krishna
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయిన వారిలో కీయార అద్వానీ కూడా ఒకరు. ఆమె తెలుగులో కూడా రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.


ఇక ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఒక హీరోతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయట . ఇక రీసెంట్ గా మళ్లీ ఆ హీరో తోనే ఒకరు పార్టీలో కనిపించడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..


బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న కీయార అద్వానీ మరోవైపు ఇతర ఇండస్ట్రీలలో ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె ఇదివరకే మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసిందట.. అలాగే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమా కూడా చేసింది. ఆ రెండు సినిమాలతో అమ్మడికి తెలుగులో మంచి గుర్తింపు అయితే దక్కింది.


ఇక రామ్ చరణ్ తోనే మరోసారి నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న రామ్ చరణ్ 15 సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించబోతోందట.. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట. దర్శకుడు శంకర్ హీరోయిన్స్ పాత్రలను కూడా చాలా హైలెట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో ఆమె రోల్ ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చాలా గ్లామరస్ గా కూడా ఉంటుందని సమాచారం.


ఇక కీయరా అద్వానీ ఒకవైపు బిజీగా ఉన్నప్పటికీ ఆమె పర్సనల్ విషయాలపై బాలీవుడ్ మీడియాలో తరచుగా వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాలతో ప్రేమలో ఉందని గత ఏడాది నుంచి జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. వీరిద్దరూ కలిసి షేర్షా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే వీరు ప్రేమలో ఉన్నట్లు కూడా బాలీవుడ్ లో టాక్ కూడా వచ్చింది.


ఇక రీసెంట్ గా మరోసారి ఇద్దరు కూడా ఒక పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత సినీ నిర్మాత అశ్విని యార్డి సోమవారం ముంబైలో గ్రాండ్ గా పుట్టినరోజును జరుపుకున్నారు. ఇక పార్టీకి ప్రముఖ బాలీవుడ్ సినీ తారలు అందరు కూడా వచ్చారు. అందులో కీయరా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ప్రత్యేకంగా కలిసి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం హైలెట్ గా నిలిచిందట.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇదివరకే కొన్నిసార్లు కీయరా అతనితో ప్రేమ లాంటి సంబంధం ఏమీ లేదు అని తెలిపింది కూడా . ఇక సిద్దార్థ్ మల్హోత్రా కూడా దాదాపు అదే తరహాలో తన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా వీరి మధ్యలో ఏదో నడుస్తోంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో కీయరా మళ్ళీ డౌట్ వచ్చే విధంగా అతను తనకు ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు అని అంతకు మించి ఎక్కువ అని కామెంట్ కూడా చేసింది. దీనితో కరణ్ జోహార్ కూడా ఏదో నడుస్తుంది అన్నట్లు కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ విధంగా పార్టీలకు కలిసి వెళుతూ ఉండడంతో మళ్ళీ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై ఈ జంట ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: