ఆది సాయికుమార్ "క్రేజీ ఫెలో" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ కావాలి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాడు. కాకపోతే ఆ తర్వాత నుండి మాత్రం ఆది సాయికుమార్ సరైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. కాకపోతే ఆది సాయికుమార్ హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఆది సాయికుమార్ ఈ సంవత్సరం తిస్ మర్ ఖాన్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.
 

ఈ మూవీ లో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆది సాయికుమార్ విజయాన్ని అందించలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయికుమార్ "క్రేజీ ఫెలో" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఆది సాయికుమార్ సరసన దిగంగాన సూర్యవన్షి హీరోయిన్ గా నటించింది. హిప్పీ మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉంది. కె. రాధామోహన్ నిర్మించిన ఈ  మూవీ కి ఫణికృష్ణ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 14 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా అక్టోబర్ 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు దస్పల్ల ,  కన్వెన్షన్ హాల్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: