తనను మోసం చేశాడు అంటున్న తమిళ్ బుల్లి తెర నటి..!!

murali krishna
సినిమా పరిశ్రమలోని నటీనటులు విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉన్నారు. ప్రముఖ తమిళ బుల్లితెర నటి దివ్య  టీవీ సిరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2017లో నటుడు అర్నవ్ తో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీరి వైవాహిక జీవితంగా సాఫీగానే కొనసాగింది. అయితే కొన్నాళ్లుగా మాత్రం వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి దాంపత్య జీవితం గందరగోళంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను మోసం చేశాడంటూ తాజాగా ఆవేదన  ఆమె వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లోనూ చీటింగ్ కేసు నమోదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. 'కేలాడి కన్మణి' సిరీయల్ తో దివ్య, అర్నవ్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా రిలేషన్ గా మారింది. వీరి అభిప్రాయాలు కలవడంతో రొమాంటిక్ రిలేషన్ కూడా మొదలు పెట్టారు. 2017లోనే సీక్రెట్ గా కూడా పెళ్లి చేసుకున్నారు. ఐదేండ్ల నుంచి ఓ అపార్ట్ మెంట్ లో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో దివ్యకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అయితే కొన్ని నెలలుగా అర్నవ్ తనను దూరం పెడుతూ వస్తున్నాడని దివ్య తెలిపారు. తను గర్భం దాల్చినప్పటి నుంచి మరింత దూరంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఎక్కడా షేర్ చేయకూడదని హెచ్చరిస్తున్నాడని తెలిపింది.
అయితే మరో నటితో తన భర్త రిలేషన్ లో ఉన్నాడని తెలిసిందంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. వారిద్దరూ ఓ చిత్ర షూటింగ్ లో ఉండగా నేరుగా అక్కడి వెళ్లి.. తన భర్త మరోనటితో ఉండగానే రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నట్టు ఆమె తెలిపింది. ఆ సమయంలో తన భర్తతో ఉన్న మరోనటి తనను కొట్టిందని, తనముందే భర్తకు కిస్ కూడా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: