చిరంజీవి వదులుకున్న.. బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టు ఇదే?

praveen
హీరో అవ్వాలని ఆశతో ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్వయంకృషితో ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఏకంగా ఇండస్ట్రీలో తన టాలెంట్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. అయితే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన చిరంజీవి కొన్ని కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రం వదులుకున్నాడట. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 మన్నెంలో మొనగాడు  :: కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అయితే ముందుగా చిరంజీవితో చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు చివరికి అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 ఆఖరిపోరాటం : ఈ సినిమాను మొదట అశ్వినీ దత్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి నాగార్జున చేతికి ఈ సినిమా వెళ్ళింది.
 అసెంబ్లీ రౌడీ : ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉందని మరోవైపు తాను బిజీగా ఉన్నానని చిరు వదులుకోవడంతో మోహన్ బాబు సినిమా చేయగా సూపర్ హిట్ అయింది.
 నెంబర్ వన్ :: ఈ సినిమాలో కూడా అటు మెగాస్టార్ చిరంజీవి నటించాలీ. చివరికి డేట్స్ ఖాళీ లేకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 సాహస వీరుడు సాగర కన్య  : ఇలాంటి కథతోనే వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులు ఆదరణకు నోచుకోకపోవడంతో ఇక ఈ సినిమా చేయడానికి రిస్క్ చేయలేదు చిరంజీవి. కానీ వెంకటేష్ ఇదే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 చంద్రముఖి :: బిఎస్ ఆదిత్య సినిమాను చిరంజీవితో చేయాలని అనుకున్నారు. ఇక ఆయన డేట్స్ కోసం ఎన్నో రోజులు ఎదురు చేశారు. కానీ చివరికి ఈ సినిమా రజనీకాంత్ తో చేయగా సూపర్ హిట్ అయింది.
 టైగర్ నాగేశ్వరరావు :: రవితేజ హీరోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వర్రావుది కూడా చిరంజీవితో తీయాలని అనుకున్నారు. చిరంజీవికి కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: