ఈ హీరోయిన్ ఆశలన్నీ ఆ హీరో పైనేనా..?

Divya
కొంతమంది హీరోయిన్స్ నటనపరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ.. అదృష్టం వారిని వరించక సినిమాలలో అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి ఇక గత రెండు మూడు సంవత్సరాలుగా విభిన్నమైన క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ వర్షా భోళమ్మ కూడా ఇ కోవకు చెందిన హీరోయిన్. కెరియర్ పరంగా హీరోయిన్గా ముందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినప్పటికీ పెద్దగా సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు. మొదట 2015 వ సంవత్సరంలో ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన మూడు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక తర్వాత విజయ్ సేతుపతి త్రిష నటించిన 96 లవ్ స్టోరీ చిత్రంలో నటించి సౌత్ ఇండస్ట్రీ ఒకసారిగా ఆకట్టుకుంది. అలాగే విజయ్ నటించిన బిగిల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా కూడా ఆకట్టుకుంది. ఇక అప్పటినుంచి ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి అయితే ఆఫర్లు వస్తున్నాయి కానీ కనీసం మీడియం హీరోలతో జతకట్టే అవకాశాలు మాత్రం రావడం లేదు.. ఇక తెలుగులో మొదట 2020లో చూసి చూడంగానే అనే చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జాను సినిమాలో కనిపించింది.. ఇక తర్వాత విజయ్ దేవరకొండ సోదరుడు నటించిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఏదో విధంగా అవకాశాలు అందుకున్నప్పటికీ కానీ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. అయితే ఇప్పుడు తాజాగా బెల్లంకొండ గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రంపై వర్షా భోళమ్మ ఆశలు పెట్టుకున్నది ఈ సినిమా ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ మరి ఈ సినిమా పరంగా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నారు.. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈసారైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: