ఆ 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజా వారు రాణి గారు మూవీ తో కిరణ్ అబ్బవరం వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర ఈ యువ హీరో అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే కిరణ్ అబ్బవరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సంవత్సరం మొదట సెబాష్టియన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ,  ఆ తర్వాత సమ్మతమే మూవీ తో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఈ హీరో నేను మీకు బాగా కావలసిన వాడిని అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ 'ఓ టి టి' విడుదలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే ...  నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నేను మీకు బాగా కావలసిన వాడిని మూవీ లో ప్రముఖ కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ,  ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: