మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'మగధీర' స్పెషల్ షోలు.. ఎప్పుడంటే..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.... అదేంటంటే...పాత సినిమాల రీ రిలీజ్...టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా జోరుగా నడుస్తోంది. అయితే కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.ఇదిలావుంటే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు పోకిరి, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జల్సా,టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు.
అయితే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ  చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు.ఇక  కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాదు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్ సినిమాను కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇకపోతే గత రెండు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఫ్లాప్ అవుతుండటం కూడా రీ రిలీజ్ సినిమాలకు కలిసొచ్చింది.ఇదిలావుంటే ఇక ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా
అతడు నటించిన మగధీర సినిమా స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. అయితే విశాఖ మద్దిలపాలెంలోని కిన్నెర థియేటర్‌లో ఈనెల 28న మగధీర స్పెషల్ షోను ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఇక ఈ షోకు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో, పేటీఎం, టిక్కెట్ న్యూ వంటి ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే విక్రయిస్తుండగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాగా మరిన్ని చోట్ల కూడా మగధీర షోలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదేమైనా పోకిరి మూవీ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. అంతేకాదు అటు త్వరలో ప్రభాస్ బిల్లా, పవన్ ఖుషి సినిమాల ప్రత్యేక షోలను ప్రదర్శించబోతుండటం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: