సూర్య 42 సినిమా కి భారి షాక్, ఆందోళనలో డైరెక్టర్..!!

murali krishna
సినీ పరిశ్రమలో నిర్మాతలకు భారీగా లీకుల రాయుళ్లతో తలనొప్పులు వచ్చి పడ్డాయి. చిన్న సినిమాలు కాకుండా.. ఎన్నో అంచనాల మధ్య, భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న స్టార్ హీరోస్ చిత్రాలకు కూడా లీకుల బెడద తప్పడం లేదు.
గతంలో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ నుంచి పలు ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ప్రభాస్ నటిస్తోన్న సలార్ మూవీ స్టిల్స్ సైతం లీక్ అయ్యాయి. ప్రభాస్ పవర్ ఫుల్ మాస్ లుక్కులో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక మరో స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రం ఫోటోస్, వీడియోస్ లీక్ చేశారు. అంతేకాదు.. ఈ ఫోటోస్ గురించి మీడియాలోను వార్తలొచ్చాయి దీంతో మేకర్స్ రంగంలోకి దిగారు. లీక్ చేసినవారికి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం సూర్య 42 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ నుంచి కొన్ని ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. బీచ్ సైడ్ రెస్టారెంట్ లో హీరోహీరోయిన్లతో చిత్రీకరిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. అందులో డైరెక్టర్ శివ కూడా కనిపించారు. ఇక ఆ ఫోటోస్ లీక్ కావడంపై స్టూడియో గ్రీన్ సంస్థ స్పందించింది. తమ పోటోస్ లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
అందరికీ ఓ విన్నం.. మేము నిర్మిస్తున్న సూర్య 42 షూటింగ్ సెట్స్ నుంచి వీడియోస్, ఫోటోస్ కొందరు షేర్ చేస్తున్నట్లు తెలిసింది అని చిత్రయూనిట్ తమ రక్తాన్ని, చెమటను చిందించి ఈ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించేలా ఈ ను తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీరు పబ్లిష్ చేసిన వీడియోస్, ఫోటోస్ చేస్తే మాకు మేలు చేసినవారు అవుతారు. అలాగే ఫ్యూచర్లో కూడా ఇలా ఫోటోస్, వీడియోస్ షేర్ చేయవద్దు. మళ్లీ ఇలా షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూ స్పెషల్ నోట్ షేర్ చేసింది చిత్రయూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: