ఎమర్జెన్సీ వార్డ్ లో మహేష్ బాబు తల్లి..... పరిస్థితి విషమం...!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబందించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. దీంతో వెంటనే అభిమానులు స్పందిస్తారు. మరి ముఖ్యంగా అభిమానులు సెలబ్రిటీల ఆరోగ్య విషయంలో ఏ బ్యాడ్ న్యూస్ వినిపించినా చాలా కంగారు పడుతూ ఉంటారు.
ఇక ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా గారి ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇందిరా దేవి ని ఏఐజి హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందిరాదేవి ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు కూడా తల్లి దగ్గరే ఉన్నాడట. ఇక ఇందిరా దేవి హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగా లేకపోవడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చారట.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కానీ వెంటిలేటర్ పై ఉంచి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు చెప్పి అభిమానులు ఎవరూ కంగారు పడవద్దు అంటూ వైద్యులు తెలిపారు. ఇక ఇందిరాదేవి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని తెలిసి మహేష్ బాబు అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇందిరాదేవి త్వరగా కోలుకోవాలని చాలామంది అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. ఎలాంటి సందర్భం అయినా తన తల్లి గురించి మాట్లాడకుండా మహేష్ బాబు ఉండలేడు. అలాగే తల్లిదండ్రుల విషయం వచ్చే సరికి మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయిపోతాడు.
తల్లిదండ్రులంటే మహేష్ బాబు కి అంత ప్రేమ. ఇక సితార గౌతమ్ లకు కూడా నానమ్మ ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా ఆమెతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కృష్ణ ఇందిరా దేవి కి 1961లో వివాహం జరిగింది. వీరికి రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు లు జన్మించారు. కృష్ణ ఆ తర్వాత 1969 లో విజయనిర్మల ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2019లో విజయనిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ చనిపోయిన వారి బాధ నుండి బయట పడుతున్న టైంలో ఇందిరాదేవి ఆరోగ్యం సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా చాలా కంగారు పడుతున్నారు. ఇక ఇందిరాదేవి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రకటించాక చాలామంది ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: