వైరల్ అవుతున్న రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్...!!

murali krishna
రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె నటిగా, టెలివిజన్ షోస్ హోస్ట్ గా కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రేణూ పూణే నుండి మకాం… హైదరాబాద్ కి అయితే మార్చింది. రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆమె నటిగా, టెలివిజన్ షోస్ హోస్ట్ గా కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రేణూ పూణే నుండి మకాం… హైదరాబాద్ కి మార్చింది.


దర్శకురాలిగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆద్య టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందులో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆమె ఆ విషయం వెల్లడించి చాలా కాలం అవుతుండగా సదరు వెబ్ సిరీస్ పై ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అయితే రవితేజ మూవీతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తుంది. ఆయన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణూ దేశాయ్ నటిస్తున్నారు.


ఇక సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ చాలా యాక్టీవ్. తన మనసుకు తోచిన ప్రతి విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. ముఖ్యంగా పిల్లల టాలెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటారు. అలాగే రేణూ దేశాయ్ తన వ్యక్తిగత విషయాలు తెలియజేస్తారు. అలాగే తమ విహారాలకు సంబంధించిన అప్డేట్స్ ఫోటోలు, వీడియోల రూపంలో ఇస్తారు. ఇటీవల ఆమె స్కాట్ లాండ్ వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. ఆ దేశం ట్రిప్ కి సంబంధించిన వీడియోలు రేణూ దేశాయ్ షేర్ చేశారు. అలాగే కొడుకు అకీరా అక్కడే చదువుకుంటున్నాడట. అకీరాను కలవడానికి వెళ్లి పనిలో పనిగా… అందమైన దేశంలో విహారాలు చేసి వచ్చారు.


కాగా రేణూ దేశాయ్ తాజా ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె 2017లో జడ్జిగా వ్యవహరించిన 'నీతోనే డాన్స్' ఫస్ట్ ఎపిసోడ్ అనుభవాలు గుర్తు చేసుకున్నారు. 'స్టార్ మా లో ప్రసారమైన 2017 నాటి నీతోనే డాన్స్ షో ఫస్ట్ డే షూట్ నాటి అనుభవాలు. ఇన్నేళ్లు గడుస్తున్నా నిన్ననే జరిగినట్టుంది' అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశారట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


కాగా 2000లో విడుదలైన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన రేణూ దేశాయ్ లవ్ లో పడ్డారు. అనంతరం ఈ జంట వివాహం చేసుకున్నారు. పవన్ ని వివాహం చేసుకున్న రేణూ దేశాయ్ నటనకు గుడ్ బై చెప్పారు. ఆమె పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా చేశారు. 2012లో మనస్పర్ధలతో పవన్ కళ్యాణ్, రేణూ విడిపోయారు. గతంలో రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు రేణూ దేశాయ్ ప్రకటన కూడా చేశారు. తన ఎంగేజ్మెంట్ ఫోటో కూడా షేర్ చేశారు. అయితే రేణూ రెండో పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ వివాహం ఆగిపోవడానికి కారణాలేమిటో తెలియదు. రేణూ రెండో వివాహాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇక అకీరా పవన్ వారసుడిగా రీఎంట్రీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టీనేజ్ కే ఆరున్నర అడుగులు ఎదిగిన అకీరా… మెగా వారసుల్లో అత్యంత పొడగరిగా గుర్తింపు పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: