బ్రహ్మస్త్ర 2: ఈసారి మెయిన్ హీరో షారుక్ ఖాన్?

Purushottham Vinay
ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన `బ్రహ్మస్ర్త` సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతిమంగా బ్రేక్ ఈవెన్ కానప్పటికీ బాలీవుడ్ కి కొంచెం ఊరటనిచ్చే వసూళ్లే ఇవి.దాదాపు 200 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ కి కొంచెం రిలీఫ్ లాగా నిలిచింది. బాయ్ కాట్ ప్రభావం..నెగిటివ్ టాక్ కొంత వరకూ ప్రభావం చూపినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా తిరుగలేని చిత్రంగానే నిలిచింది.దీంతో బ్రహ్మస్ర్త-2 సినిమాకి ఊపిరి పోసినట్లు అయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ అప్పుడే రెండవ పార్ట్ పనులు ప్రారంభించారు. ఇప్పటికే హీరో రణబీర్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ..`` తాను ఇంకా అయాన్ ఈ పాత్ర కోసం షారుక్ ఖాన్ను ఎంపిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.కానీ షారుక్ ఖాన్ ఇదే చిత్రంలో మోహన్ భార్గవ్ అనే సైటింస్ట్ పాత్రలో నటించారు.అయితే ఆ పాత్ర మొదటి భాగంలో చంపబడుతుంది.


మరి ఇప్పుడు అదే రోల్ ని రెండవ భాగంలో లీడ్ రోల్ గా చర్చకు రావడంపై ఆసక్తి సంతరించుకుంటుంది. అయితే షారుక్ ఖాన్ ని అయాన్ ఇలా తెరపైకి తీసుకు రావడం మంచి ఆలోచనగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయాన్ ఆ పాత్రని ఎలా డిజైన్ చెయ్యాలి? అన్న కోణంలో సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు రణబీర్ మాటల్ని బట్టి తెలుస్తోంది.దీన్ని బట్టి పార్ట్ 2 లో షారుక్ ఖాన్ మెయిన్ హీరో అవ్వొచ్చని దాదాపు ఓ అంచనాకి రావొచ్చు. ఇంకా రెండవ భాగంలో ఇంకెంత మంది బిగ్ స్టార్స్ ని సీన్ లోకి తీసుకొస్తారు? అన్నది చూడాలి. మొదటి భాగాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. రెండవ భాగం స్పాన్ పెరుగుతోన్న నేపథ్యంలో బడ్జెట్ 400 కోట్లకు మించే ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: