జయసుధ గురించి ఎవరికీ తెలియని నిజాలు.!!!

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లలో జయసుధ కూడా ఒకరు. సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి స్పందన తెచ్చుకుంది.
ఇక పండంటి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జయసుధ సుమారుగా తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ, మలయాళం భాషల్లో కలుపుకొని 320కు పైగా సినిమాలలో నటించింది. ఇకపోతే దర్శకుడు దాసరి నారాయణరావు తో ఏకంగా 27 సినిమాలలో నటించింది. ఇక జయసుధకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బంధువైన రాజేంద్రప్రసాద్ తో వివాహం జరగగా.. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత 1985లో ముంబైకి చెందిన నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది . వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
 
ఇక తర్వాత 2001లో క్రైస్తవ మతానికి మారిపోయిన జయసుధ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ కూడా అందించారు . ఇక విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. జయసుధ తండ్రిని ఒప్పించి జయసుధను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది విజయనిర్మల. తన జీవితంలో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపిన జయసుధ వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.. ఇకపోతే ముందుగా నితిన్ కపూర్ , జయసుధల పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే అప్పట్లో తెలుగు సినిమాలను మద్రాస్ లో తీసే విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పట్లో దర్శకుడు దాసరి నారాయణరావు తెలుగు , తమిళ్, హిందీ, మలయాళ సినిమాలు చేసేవారు. ఇక ఈ దర్శకుడు తీసిన సినిమాలలో హీరోగా జితేంద్ర నటించేవారు. ఇక ఆయన సోదరుడే నితిన్ కపూర్… మద్రాస్ లో తన అన్న వ్యవహారాలు చూసుకునే బాధ్యత నితిన్ కపూర్ తీసుకున్నారు. ఇక ఈ పనిని చూసుకోవడానికి ఒక ఇంటిని తీసుకోవడం వల్ల జయసుధ , నితిన్ కపూర్ ల మధ్య పరిచయం ఏర్పడింది. ఎలా అంటే నితిన్ కపూర్ తీసుకున్న ఇంటి పక్కనే జయసుధ ఇల్లు కూడా ఉండేది. ఇక వీరిద్దరి పరిచయం తర్వాత మంచి అనుబంధం ఏర్పడింది.
ఇక ఇద్దరికీ కూడా క్రికెట్ అంటే మహా ఇష్టం. ఇక నితిన్ ను చూసిన మొదటిసారి ఏదో తెలియని అనుబంధం కలిగిందని జయసుధ తెలుపుతూ ఉంటుంది. కానీ గతంలో మొదటి భర్తతో విడిపోయిన తర్వాత కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను అని అయితే ఆ విషయాలను చాలా వరకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయను అని కూడా తెలిపింది జయసుధ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: