ది ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!
ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ,టీజర్ ప్రేక్షకులలో, అభిమానులలో సైతం బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటుంది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ విడుదలవుతోంది. అదేమిటంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 25వ తేదీన కర్నూలలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఒక పిట్టు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతోనైనా నాగార్జున సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి. ఇక అంతే కాకుండా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు అదే రోజున చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, మంచు విష్ణు నటిస్తున్న జిన్నా, అలాగే బెల్లంకొండ సాయి నటిస్తున్న మరొక సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రాలలో ఏ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంటుందో చూడాలి.