ఆ మూవీలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు ఆయన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని , అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరస సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా హెబ్బా పటేల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తర్వాత ఎన్నో మూవీ లలో నటించిన హెబ్బా పటేల్ కు ఆ తర్వాత మాత్రం భారీ విజయం బాక్సాఫీస్ దగ్గర దక్కలేదు. ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ తాజాగా ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో హెబ్బా పటేల్ డి గ్లామరైజ్డ్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.  

ప్రస్తుతం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ తాజాగా శాసనసభ అనే పాన్ ఇండియా మూవీ లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ కి వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇందులో ఓ ప్రత్యేక సాంగ్ కోసం హెబ్బా పటేల్‌ ను తీసుకున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించిన హెబ్బా పటేల్ 'శాసనసభ' మూవీ లోని స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: