సమయం వస్తే రాజమౌళితో సినిమా సాధ్యమే... నాగార్జున..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను అద్భుత మైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రపంచ వ్యాప్తం గా అద్భుత మైన క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకు లలో ఒకరు ఆయన రాజమౌళి కొన్ని రోజుల క్రితమే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుత మైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు .

ఇది ఇలా ఉంటే రాజమౌళి మరి కొంత కాలం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో ఒకరు ఆయన నాగార్జున ,  రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . తాజాగా రాజమౌళి గురించి నాగార్జున మాట్లాడుతూ ... తనకు రాజమౌళి దర్శకత్వం లో నటించాలని ఉందని నాగార్జున చెప్పు కొచ్చాడు .

టైమ్ వస్తే రాజమౌళి తో మూవీ సాధ్యమే అన్నారు . రాజమౌళి దర్శకత్వం లో పూర్తి స్థాయి మూవీ ని చేయాలని ఉంది అని నాగార్జున అన్నారు.  దీని గురించి దిగ్గజ దర్శకుడిని తాను తరచూ అడుగుతూనే ఉన్నానని నాగార్జున తెలిపారు . కానీ, ప్రతిసారి చిరునవ్వే రాజమౌళి సమాధానం అవుతుంది అని నాగార్జున అన్నారు.  రాజమౌళి కథను నమ్మే దర్శకుడని నాగార్జున చెప్పు కొచ్చాడు. కథ పూర్తి అయ్యాక   ఆ కథ కు తగ్గ నటులను వెతుకుతారన్నారు. అలాంటి సమయం వచ్చినప్పుడే తమ కలయిక సాధ్యం అవుతుందని నాగార్జున చెప్పారు. ఆ రోజు కోసం ఎదురు చూడాలని నాగార్జున అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: