తెలుగు సినిమా చేయాలనే కోరిక ఉంది. - గౌతమ్ మీనన్!!

P.Nishanth Kumar
తమిళ దర్శకులకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి గౌతమ్ మీనన్ ను చూస్తే తెలుస్తుంది. ఈయన మాత్రమే కాకుండా మరి కొంతమంది తమిళ దర్శకులకు తెలుగులో భారీ స్థాయిలోనే డిమాండ్ ఉంది. అయితే దక్షిణాదిలో ఏ దర్శకుడు చేయనటువంటి మ్యాజిక్ ఆయన తన సినిమాల ద్వారా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రేమ కథ సినిమాల విషయంలో ఆయన ఏ విధంగా సినిమాలను తెరకెక్కిస్తాడు అంటే ఆ విధమైన మ్యాజిక్ ఎవరూ చేయలేదని చెప్పాలి.

ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న నేపథ్యంలో ముత్తు సినిమా ను విడుదల చేసి మరొక విజయాన్ని తన ఖాతా లో  వేసుకున్నాడు. శింబు హీరోగా నటించిన ఈ సినిమా ఆయనకు భారీ విజయంతో పాటు క్రేజీ ను డబల్ చేసింది తెలుగులో. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబం ధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఆయన తెలుగు సినిమాలపై తన ఒపీనియన్ చెప్పి తన అభిమానులను ఎంతగానో సంతోషపరిచాడు. త్వరలోనే తెలుగులో సినిమా చేయబో తున్నాను అని చెప్పాడు. గతంలో చాలాసార్లు ట్రై చేసినా కూడా అది వీలు పడలేదని ఈసారి తప్పకుండా తెలుగులో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను అని ఆయన అన్నాడు.

గత కొన్ని రోజులుగా ఆయన టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సోషల్ మీడి యాలో కూడా ఇది ఓకే అయింది అని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబో తున్నాడు. ముత్తు సినిమాని కూడా తెలుగులో విడుదల చేసింది రామ్ ఫాదర్ స్రవంతి రవి కిషోర్ కావడంతో ఈ సినిమా తప్పకుండా వారి కాంబినేషన్ లో ఉంటుంది అని అం దరూ గట్టిగా నమ్ముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: