హిట్ కోసం మాస్టర్ ప్లాన్.. వీడియోతో మెగా ట్రీట్..

Satvika
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ పడలేదు.దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది..విడుదలకు సిద్ధంగా ఉంది..మలయాళ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'గాడ్ ఫాదర్' సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. భారీ రేంజ్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందుతున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్స్,టీజర్ ఈ మూవీపై ఉన్న అంచనాలను పెంచుతున్నాయి.విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యూనిట్ అంతా రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. తాజాగా ఈ ఈవెంట్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారీ ఎత్తున జరగబోతున్న ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ సంతోషం లో మునిగిపోయారు..ఈ సినిమా అన్న హిట్ అవుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: