ఏ మాయ చేసావే మూవీని మహేష్ అందుకే రిజెక్ట్ చేశాడట?

Purushottham Vinay
టాలీవుడ్ ఎక్స్ కపుల్ నాగ చైతన్య, సమంత జంటగా నటించిన లవ్ స్టోరీ 'ఏ మాయ చేసావే'. తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజుల ఈ సినిమాకి నిర్మాత. అయితే ఈ సినిమాలో ముందుగా నాగ చైతన్య కాక మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట గౌతమ్ మీనన్. ఇక ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వినిపించాలనుకున్నాడట గౌతమ్. అందుకు ముందుగా ఈ సినిమా నిర్మాత మంజులకు ఈ కథ గురించి చెప్పాడట. కథ బాగుంది కానీ, మహేశ్ చేస్తాడో? లేదో? అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మంజుల తెలిపిందట. తర్వాత ఈ కథను మహేశ్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా? అని అనేశాడట. మహేశ్ బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఏదైనా యాక్షన్ కథ చేద్దామని మహేశ్ బాబు చెప్పాడట.


ఒకవేళ ఆ మూవీని మహేశ్ చేసి ఉంటే పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ తెలిపాడు.ఒకవేళ నిజంగా ఆ చిత్రంలో కార్తిక్ పాత్రలో మహేశ్ బాబు చేసి ఉంటే ఈ మూవీ ఫలితాలు ఇంకా ఎలా ఉండేవో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మహేశ్ బాబు.. రా ఏజెంట్‌గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో మహేష్ రాజమౌళి ఫస్ట్ టైం హాలీవుడ్ ని టచ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: