ఆ సినిమా చేయొద్దు అంటూ.. అనుష్కకు ప్రభాస్ వార్నింగ్?

praveen
సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంతో మంది స్నేహితులు గా మారిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. హీరోలు దర్శకులు కావచ్చు లేదా హీరోలు హీరోయిన్లు కావచ్చు ఎవరైనా సరే స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్లో అందరికీ నచ్చిన మెచ్చిన జండా ఏదైనా ఉంది అంటే అది అనుష్క ప్రభాస్ జంట అని చెప్పాలి.  వీళ్ళు నిజంగానే స్నేహితులా లేదా ప్రేమ లో కొనసాగుతున్నారా...  లేదంటే పెళ్లితో ఒక్కటయ్యారా అన్నది ఇప్పటికీ ప్రేక్షకులకు కన్ఫ్యూజనే.

 ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇద్దరు కూడా ఎక్కువగా స్టయిల్ గా కనిపించరు. ఎంతో హుందాగా ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు. ఇక ఫంక్షన్లలో వీరు మాట్లాడేది కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒకవేళ ప్రేమించుకుంటే పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని ఎంతోమంది అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు.  ఈ ఇద్దరి గురించి   ఏ వార్త బయటకు వచ్చినా అది సెన్సేషనల్ గానే  మారిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరు సినిమాల స్క్రిప్ట్ విషయంలో కూడా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారట.

 అయితే అనుష్క నటించాల్సి ఉన్న ఒక సినిమా విషయంలో ప్రభాస్ ఏకంగా అనుష్క కు వార్నింగ్ ఇచ్చాడట.  ఆ సినిమా లోని పాత్ర నాకు నచ్చలేదు. ఆ సినిమాకు నో చెప్పేసేయ్ అంటూ చెప్పాడట. కానీ అనుష్క మాత్రం పాత్ర బాగా నచ్చడంతో ప్రభాస్ మాటను కాదని చివరికి సినిమా చేసింది.  కానీ ఆ సినిమా మాత్రం చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది.  ఆ సినిమా మరేదో కాదు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేదం సినిమా.  ఇందులో వ్యభిచారిణి పాత్రలో నటించింది అనుష్క.  ఇక ఈ పాత్రలో అనుష్క ని చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఈ పాత్రలో మాత్రం అనుష్క నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: