కృష్ణం రాజు స్నేహితుడి.... ఆసక్తికరమైన వ్యాఖ్యలు....!!

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని కుటుంబ సభ్యులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

ఇక ప్రభాస్ , అనుష్కను ప్రేమిస్తున్నాడని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ మీరు మాత్రం ఈ విషయంపై ఏమాత్రం స్పందించలేదు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ముందుగానే అమెరికాలో ఒక ఇంటిని కూడా కలిసి కొనుగోలు చేశారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రూమర్స్ అయితే విపరీతంగా రావడం గమనార్హం.

ఇకపోతే కొడుకు పెళ్లి చూడకుండానే కాలం చేసిన కృష్ణంరాజు.. చివరి కోరిక తీరకుండానే చనిపోయారని ఆవేదన అందరిలోనూ ఎక్కువవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రభాస్- అనుష్క పెళ్లి ప్రస్తావన తెరపైకి రావడం గమనార్హం. ఇక ఈ విషయంపై కృష్ణంరాజు స్నేహితుడు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ప్రభాస్ , అనుష్క పెళ్లి గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా చెల్లెళ్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. ఇక తన పెళ్లి కూడా త్వరలో జరిగితే కృష్ణంరాజు గారి ఆత్మ చాలా సంతోషిస్తుంది అంటూ ఆయన తెలిపారు.. అంతేకాదు అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరిగితేనే చూడడానికి, వైవాహిక జీవితానికి బాగుంటుంది అంటూ వాక్యానించారు. కృష్ణంరాజు చనిపోయిన ఏడాదిలోపే పెళ్లి అయిపోతే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు.


ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ షూటింగులతో బిజీగా ఉండడం.. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ వల్ల చాలా బిజీగా హైదరాబాద్ లో తక్కువగా .. ముంబైలో ఎక్కువగా ఉన్నాడని పెళ్లి చేసుకోవడానికి సమయం కష్టం అంటూ అభిప్రాయపడ్డారు.. ఇకపోతే ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అంటూ వాళ్ళ పెళ్లి మాట ఎత్తి ఇద్దరి అభిమానులను ఊరించారు నిర్మాత . మరి నిజంగా చిట్టిబాబు చెప్పినట్లు ప్రభాస్ - అనుష్కల పెళ్లి జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ అందరూ కోరుకుంటున్న విషయం ఏమిటంటే కృష్ణంరాజు గారి ఆత్మ శాంతించాలి అంటే ప్రభాస్ - అనుష్కల పెళ్లి జరిగితేనే అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: