అద్భుతమైన గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీ తో మెప్పిస్తున్న శింబు..!!

Divya
ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో హీరో శింబు కలిసిన తెరకెక్కించిన తమిళ చిత్రం విందు తానిందు కాడు.. ఈ చిత్రాన్ని లైఫ్ ఆఫ్ మొత్తు అనే పేరుతో తెలుగులో విడుదల విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రవికిషోర్ తెలుగులో విడుదల చేయిస్తున్నారు సెప్టెంబర్ 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఇటీవలే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని తెలియజేశారు. ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ ప్రేమ కథ చిత్రం అని తెలిపారు. ఇందులో పలు రకాలుగా ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని తెలిపారు.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కంటే ముందుగా తమిళ్ లో సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నామని అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతుందని తెలియజేశారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెట్టిజెన్లు సైతం ఎలా స్పందించారో ఇప్పుడు మనం చూద్దాం. ఇక కొంతమంది డైరెక్టర్ గౌతమ్ మీనన్, శింబు కెరియర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ బెటర్ గా ఉంటుంది అని తెలియజేశారు. ఈ చిత్రంలో శింబు నటనపరంగా అద్భుతంగా ఇరగదీసాడని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరొకపక్క ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా బాగుంది అని తెలిపారు.

హీరో శింబు ను సింగిల్ టేక్ రాజా అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందట. ఈ సినిమాలో శింబుకేరియర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ గా మెరుస్తుందని చెప్పవచ్చు.. సరికొత్త అవతారంలో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను సాధించడంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. మొత్తానికి హీరో శింబు గుర్తుండిపోయే పాత్రలో నటించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో శింబు ను చూసి అందరూ షాక్ అవుతారని తెలియజేస్తున్నారు.మరి తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: