వందకు పైగా దేశాల్లో విడుదల కానున్న 'విక్రమ్ వేద' మూవీ..!

Pulgam Srinivas
తమిళంలో మాధవన్ మరియు విజయ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విక్రమ్ వేద సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే . అలా తమిళం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన విక్రమ్ వేద మూవీ ని హిందీ లో కూడా విక్రమ్ వేద అనే పేరు తోనే రీమేక్ చేశారు . ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్నటు వంటి హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటించారు .

యాక్షన్ ఎంటర్టైనర్ గా తరికెక్కిన ఈ మూవీ కి పుష్కర్ –గాయత్రి దర్శకత్వం వహించారు .  ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది .  బాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటి సారి విక్రమ్ వేద మూవీ ని ఏకంగా 100 కు  పైగా దేశాల్లో రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాణ సంస్థ అయినటు వంటి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది .

ఇది ఇలా ఉంటే ఇప్పటికే విక్రమ్ వేద మూవీ నుండి చిత బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . మరి విక్రమ్ వేద మూవీ హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే . ఈ మూవీ లో రాధిక ఆప్టే ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: