11 ఏళ్ళ తర్వాత ధనుష్ తో ఆ డైరెక్టర్... హిట్ అవుతుందా ?

VAMSI
గత రెండు వారాల క్రితమే విడుదల అయిన తీరు చిత్రంబలం సినిమా అటు తమిళ్ మరియు తెలుగు రెండు భాషలలోనూ సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో ధనుష్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, భారతీరాజా, ప్రియాయ్ భవాని శంకర్ లు నటించారు. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక చిన్న లైన్ ను తీసుకుని స్క్రీన్ ప్లే ను అద్భుతంగా నడిపించిన తీరుకు హట్సాప్ చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాటల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన పాటలకు మాములు రెస్పాన్స్ రావడం లేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా ధనుష్ జీవించేశాడు. ఇక తాత పాత్రలో భారతీరాజా నటన సినిమాకే హైలైట్.
ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు అని చెప్పడానికి ఈ సినిమా ఒప్పుకోవడమే ఒక నిదర్శనం. చాలా కాలం తర్వాత ఒక మంచి కుటంబ ప్రేమకథ చిత్రాన్ని చుసిన ఫీలింగ్ కలిగింది అంటూ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పుడు మరొక చిత్రంతో ఈ నెల 29 న మన ముందుకు రానున్నారు ధనుష్. ఈ చిత్రాన్ని ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో ఉన్నా మరో విశేషం ఏమిటంటే ధనుష్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. హీరో మరియు విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు తెలుగు టైటిల్ " నేనే వస్తున్నా " అని పెట్టడం జరిగింది.
ధనుష్ కు జోడీగా ఇల్లి అవ్రం నటిస్తున్నది. ఇక తన అన్నతో ధనుష్ సినిమా చేసి దాదాపుగా సంవత్సరాలు గడిచిపోయింది. ఇది ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా కథ గురించి ఎక్కడ వినబడలేదు. స్వయంగా ధనుష్ ఈ సినిమాకు కథను అందించాడు. నిజంగా తిరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ధనుష్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: