5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్ల కలెక్షన్లను సాధించిన 'ఒకే ఒక జీవితం' మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించగా , శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ టైమ్ ట్రావెల్ జోనర్ లో తెరకెక్కింది. సెప్టెంబర్ 9 వ తేదీన ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

 
నైజాం : 2.20 కోట్లు .
సీడెడ్ : 34 లక్షలు .
యు ఏ : 46 లక్షలు .
ఈస్ట్ : 32 లక్షలు .
వెస్ట్ : 23 లక్షలు .
గుంటూర్ : 31 లక్షలు .
కృష్ణ : 28 లక్షలు .
నెల్లూర్ : 18 లక్షలు .
5 రోజుల బాక్స్ ఆఫీస్ అని ముగిసే సరికి ఒకే ఒక జీవితం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.362 కోట్ల షేర్ , 7.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 35 లక్షలు .
తమిళనాడు : 0.80 లక్షలు .
ఓవర్ సిస్ లో :  1.36 కోట్లు .
5  రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 6.83 కోట్ల షేర్ , 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: