గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ ఎవరంటే..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. డైరెక్టర్ మెహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నది. దసరా సందర్భంగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బంధం చాలా స్పీడ్ గా పెంచుతున్నారు. గాడ్ ఫాదర్ అనేది ఒక హై టెన్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కించిన లూసిఫర్ సినిమాకి అధికారికంగా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడం జరుగుతోంది.

అయితే ఈ సినిమాని కొన్ని మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక నయనతార, సత్యదేవ్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. హీరో సునీల్, సముద్రఖని, బ్రహ్మాజీ ,మురళి శర్మ తదితరులు కూడా నటిస్తూ ఉన్నారు. అయితే వీళ్లల్లో మెయిన్ విలన్ ఎవరు అనే  విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇప్పటికే టీజర్ ను  కూడా విడుదల చేసిన చిత్ర బృందం రిలీజ్ డేట్స్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాలోని కొంతమంది క్యారెక్టర్ లను పోస్టర్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే సత్యప్రియ అనే పాత్రలో నయనతార.. జై దేవ్ గా సత్యదేవ్ ని చూపించారు. ఇక లూసిఫర్ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెయ్ రాయ్ నటించారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తారేమో .. కానీ ఈ చిత్రంలో సత్యదేవ్ విలన్ గా నటిస్తున్నట్లుగా సందేహాలు వినిపిస్తున్నాయి. ఇక సముద్రఖని కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు విలన్ గా ఇతని పేరు కూడా వినిపిస్తోంది. ఇక సుకుమార్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది ఒకవేళ ఈయనే విలన్ గా కనిపిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: