శంకర్ వెయ్యి కోట్ల సినిమా.. వర్క్ అవుట్ అయ్యేనా!!
రామ్ చరణ్ సినిమా తో పాటే అయన ఇండియన్ 2 సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ను పూర్తి చేశాకే శంకర్ రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది మధ్యలోనే ఆగిపోవడం తో చరణ్ సినిమా ను మొదలుపెట్టాడు. అయితే కమల్ హాసన్ మధ్యవర్తిగా వ్యవహరించడంతో ఈ సినిమా మళ్ళీ తెరకెక్కుతుంది. ఫైనల్ గా ఈ రెండు సినిమాలతో మంచి కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు శంకర్. ఇక అయన బాలీవుడ్ లో అపరిచితుడు సినిమా ను రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడు. రణవీర్ సింగ్ ఈ సినిమా కి హీరో గా వ్యవహరిస్తున్నాడు.
మరి ఈ సినిమా ను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి. అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు. మిగతా వాటిపై క్లారిటీ కూడా లేదు. అయితే ఓ సినిమా మీద ఎప్పటి నుంచో రూమర్ వినిపిస్తూనే వస్తోంది. త్వరలోనే ఈ దర్శకుడు వెయ్యి కోట్ల మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఇది ఉందని గట్టిగా సమాధానం వినిపిస్తుంది. ఇందులో రామ్ చరణ్ మరియు హృతిక్ రోషన్ హీరో లు గా నటిస్తున్నారట. మరి ఇప్పుడు శంకర్ పై ఏ నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారో తెలియదు కానీ కొంతమంది సినిమా విశ్లేషకులు మాత్రం ఇది ఎంతో రిస్క్ అని చెప్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటిని ఈయన ఎప్పుడు పూర్తి చేసే ఆ సినిమా ను మొదలుపెడతాడో చూద్దాం.