బోయపాటి కోసం అదిరిపోయే లుక్ లో రామ్!!

P.Nishanth Kumar
మాస్ చిత్రాల దర్శకుడైన బోయపాటి శ్రీను ఇప్పుడు తన తదుపరి సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత ఏడాది ఆయన నందమూరి బాలకృష్ణ తో చేసిన అఖండ చిత్రం ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పు డు చేయబోతున్న తదుపరి సినిమా ప్రేక్షకులను అంతకుమించి ఆకట్టుకుంటుంది అనేది ఆయన అభిమానుల మాట. దానికి తగ్గట్లుగానే తన తదుపరి సినిమాకి హీరోగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను ఎంచుకోవడం విశేషం.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వారియర్ సినిమాతో వచ్చి ఘన విజయాన్ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు అతి తొందరలోనే మరొక మాస్ చిత్రాన్ని అందరి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రూపొందించబడలేదు. అందుకే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు భారీ స్థాయిలోనే పెట్టుకున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరు స్తూ ఉండగా ఈ సినిమా కోసం రామ్ వెరైటీ వెరైటీ లుక్ ట్రై చేస్తూ ఉండడం విశేషం. 

గతంలో ఆయన ఎప్పుడూ కనబడిన విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. లుక్స్ పరంగా వైవిధ్యత ను చూపి స్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ హీరో ఈసారి మాస్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటాడట. చిట్టూరి సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టురి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతోంది. ఎప్పటిలాగే బోయపాటి శ్రీను తన ఊర మాస్ కథతో ఈ సినిమాను చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా చేస్తూ ఉండడం మరింత విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: