బ్రహ్మాస్త్ర సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగానా రనౌత్..!!

Divya
రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించారు. సెప్టెంబర్ 9 వ తేదీన ఈ సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసింది ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీ డిజాస్టర్ రిజల్ట్ అన్నట్లుగా కగంగాన రనౌత్ తేల్చి చెప్పేస్తోంది.అంతేకాకుండా పి వి ఆర్ ఐకాన్ సంస్థలకు.. రూ.800 కోట్ల రూపాయలు నష్టం కూడా వచ్చినట్లుగా ఆమె లెక్కలు చెబుతోంది.
తాజాగా కంగనా ప్రకటనలో తెలియజేస్తూ.. రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాతో రూ.800 కోట్ల రూపాయలు సంపదను తుడిచిపెట్టడం ఖాయమని తెలియజేసింది. దీంతో బ్రహ్మాస్త్ర నిర్మాతలు అవకతవక్కలకు పాల్పడుతున్నారని ఆమె తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా ఈ చిత్రం ఒక డిజాస్టర్ గా అని తెలియజేసింది. ఇక తన జీవితం లో ఎప్పుడూ కూడా ఒక మంచి సినిమా చేయని డైరెక్టర్ కోసం రూ. 600 కోట్ల రూపాయలు బడ్జెట్ చేయడం ఇదొక విడ్డూరమని కంగనాలను తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్నో స్టూడియోలు కూడా మూతపడ్డాయని తెలియజేసింది.
బ్రహ్మాస్త్ర నిర్మాతలు మీడియాను నియంత్రిస్తున్నారని.. అలాగే కమల్ ఆర్ ఖాన్, కె ఆర్ కె ను జైల్లో పెట్టించారని కంగానా తెలియజేస్తోంది.నిజాయితీ లేని సినిమాను నిజమేనని నమ్మించేందుకు టికెట్లు కొనిచ్చేందుకు ప్రేక్షకులను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. కొంతమంది సినిమా మాఫియా తమ ఆధీనంలో తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. నమ్మకమైన స్నేహితులు, నిర్మాతలు దొరకడం చాలా కష్టమని ముందు ముందు మన సినిమాలు ఎలా తీయాలో తెలియడం లేదని కంగానాలను ప్రశ్నిస్తోంది. చివరికి బ్రహ్మాస్త్ర సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడా లి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: