బిగ్ బాస్ 6 : క్లాస్ మేట్ తో ముద్దు.. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆరోహీ రావు..!!

Anilkumar
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా మొదలు పెట్టేసింది.ఇక సెప్టెంబర్ 4వ తేదీన స్టార్ మా చానల్లో అంగరంగ వైభవంగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమైందని చెప్పవచ్చు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు రాగా వారిలో ఒకరు ఆరోహిరావు కూడా.. ఎంబీఏ చదివే రోజుల్లో ఒక అబ్బాయి తో ప్రేమలో పడ్డట్టు అసలు విషయాన్ని బయట పెట్టింది. ఆ అబ్బాయితో తన లవ్ జర్నీ ఎలా సాగిందో కూడా బిగ్ బాస్ హౌస్ లో తెలియజేసింది ఆరోహీ.. ఆరోహీ జీవితం ఒడిదుడుకులతో కూడుకున్నది.. తల్లి అనారోగ్యంతో మరణిస్తే.. తండ్రి పట్టించుకోకుండా ఇంకో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు.. కష్టపడి చదువు పూర్తి చేసిన ఆరోహి రావు కెరియర్ కోసం హైదరాబాదు వచ్చింది..

ఈమె కెరియర్ కోసం అంజలిగా ఉన్న తన పేరును ఆరోహీగా మార్చుకొని నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.అయితే  కష్టాల జీవితంలో కూడా ఈమెకు ఒక ప్రేమ కథ ఉందట.. డిగ్రీ చదివే వరకు కూడా ప్రేమల గురించి పెద్దగా తెలియదు.. ముద్దు పెడితే కడుపు వస్తుందేమో అనుకునేంత అమాయకత్వంఅట ఆమెది.ఇక  అలాంటి నాకు ఎంబీఏ చదివే రోజుల్లో ఒక అబ్బాయి నచ్చాడు. ఆయనది మంచి హైట్, హ్యాండ్సమ్ గా ఉండేవాడు.  ఆయన కాలేజీకి తక్కువగా వచ్చేవాడు. అయినా  కూడా ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పేవాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది.అంతేకాదు  ఎక్కువగా అతడు పాలిటిక్స్ లో తిరుగుతూ ఉండేవాడు.

అలా తనతో పరిచయం ఏర్పడింది.తర్వాత అతడిని ఒక రోజు బ్లాక్ షర్ట్ లో చూసి అలాగే ఉండిపోయాను. నాకు అది ప్రేమా.. ఆకర్షణా అని తెలుసుకోవడానికి మూడు నెలలు కండిషన్ కూడా పెట్టుకున్నాను .కానీ  నెల రోజులకే నాకు బోర్ కొట్టేశాడు.ఇక  దాంతో మెల్లగా దూరం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక మా ప్రేమ జర్నీ మొదలైన నెల రోజులకే నేను కాలేజీ నుండి బయటకు వెళ్లిపోయాను. ఇప్పటికి ఆయన నాకు టచ్ లో ఉన్నాడు .  తను కాకుండా స్నేహితుడి కంటే ఎక్కువైనా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ....టైటిల్ గెలిచిన గెలవకపోయినా గౌరవంగా ఆట ఆడి రా అంటూ సూచించారు అంటూ ఆరోహి తెలిపింది.ఇలా  మరో వ్యక్తి తన జీవితంలో ఉన్నాడు అంటూ తన ప్రేమ గురించి బయట పెట్టింది ఆరోహి రావు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: