గాడ్ ఫాదర్ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య డిజాస్టర్ తర్వాత వరుసబెట్టి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ప్రస్తుతం నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రతి ఒక్కరి అప్డేట్ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు తాజాగా నయనతార క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ మేకర్స్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో నయనతార సత్యప్రియ జైదేవ్ అనే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలియజేశారు.

ఇక నయనతార ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఈమె సాంప్రదాయమైన చీర లో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది.. ఏదో లెటర్ ని టైపింగ్ చేస్తూ ఉన్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తూ ఉంది. ఇక ఇది వరకే నయనతార చిరంజీవి కాంబినేషన్లో సైరా నరసింహారెడ్డి విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో నయనతార మాత్రం కీలకపాత్రలో కనిపిస్తున్నది. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో కూడా మొదటిసారి చిరంజీవి పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నారు.
ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి చిరంజీవి ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్స్ విడుదల చేయగా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇందులో సత్యదేవ్, సునీల్ , పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పకులుగా.. కొణిదల ప్రొడక్షన్ హౌస్ మీద నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకొని అభిమానులకు సైతం ఆనందపడేలా చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం నయనతారకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: