మహేష్ బాబు మూవీ వల్లే నా కెరియర్ దెబ్బతింది: సంగీత

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సంగీత  అందరికి సుపరిచితమే.అయితే ఖడ్గం సినిమా ద్వారా ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఈ ఒక్క డైలాగ్ తోనే బాగా పాపులారిటీని సంపాదించుకున్న సంగీత ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి , ఖుషీ ఖుషిగా వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఒకవైపు గ్లామరస్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటూనే మరొకవైపు ఫ్యామిలీ హీరోయిన్ గా కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమెకి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనా..  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా  ఎంట్రీ ఇచ్చింది.

అంతేకాదు ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కు ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల అప్పుడప్పుడు టీవీ షోలో కూడా కనిపిస్తూ సందడి చేస్తోంది.. కాగా 2010లో కారా మజాకా అనే సినిమాలో నటించిన సంగీత ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయిన విషయం తెలిసిందే.. ఎప్పుడు ఇండస్ట్రీలోకి తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టినా.. కేవలం ఒక్క డైలాగ్ తో బాగా క్రేజ్ సొంతం చేసుకుంటుంది .ఇకపోతే సరిలేరు మీకెవరు సినిమాతో మొదలుపెట్టి అక్కడ.. అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని డైలాగ్ తో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమా తన కెరీర్ నాశనం చేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంగీత..

ఇదిలావుంటే ఇక ప్రస్తుతం మసూధ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథి గా వచ్చిన సంగీత కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది. అయితే హోస్ట్ ఆలీ.. సరిలేరు నీకెవ్వరు సినిమా లో మదర్ గా చేశారు కదా అది మీకు ఎలా అనిపించింది అని అడగగా.. డైరెక్టర్ అనిల్ ని చూస్తే ఇలా ఎందుకు చేసావురా నన్ను అని తిట్టుకుంటూనే ఉంటానని సంగీత చెప్పింది. అంతేకాదు అలాగే అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని అడగగా ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్ళాను.ఇక  ఆ తర్వాత వాళ్ళు చిత్రం నుంచి తీసేసారని కూడా తెలిపింది.ఆ సినిమాలో మదర్ క్యారెక్టర్ తర్వాత తనకు అవకాశాలు రాలేదు కూడా తెలిపింది సంగీత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: