ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..!!

Divya
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటైన rrr సినిమాతో ఎన్టీఆర్ కోరుకున్న సక్సెస్ దక్కిందని చెప్పవచ్చు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో కలిసి సినిమా చేయబోతున్నారు ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత నీల్ తో కూడా మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం.. హోం మంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం జరిగింది.

దీంతో పలువురు బిజెపి నేతలు ఎన్టీఆర్ తమ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పడంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ సొంతగా టిడిపి ఉన్న గతంలో పలు సందర్భాలలో ఎన్టీఆర్ తాను టిడిపికి పరిమితం అవుతానని మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాల విషయంపై నోరు విప్పితే కానీ అసలు విషయం ఏంటో తెలిసే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరొకవైపు సినిమాలపరంగా ఎన్టీఆర్ అద్భుతమైన నటన రాణిస్తున్న సమయంలో రాజకీయాలపై దృష్టి పెట్టితే తన సినీ కెరియర్ దెబ్బతింటుందని మరికొంతమంది అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఎన్టీఆర్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రావడం జరగదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా అయినా సరే రాజకీయాలలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది అభిమానులు సైతం ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చాడంటే పలు సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయంగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టత రావాలి అంటే మరో కొన్ని నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: