మెగా హీరో వైష్ణవ్ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి!!

P.Nishanth Kumar
ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై భారీ స్థాయిలో ఆకట్టుకున్న హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ తొలి సినిమా 100కోట్ల క్లబ్ లోకి చేరడం నిజంగా అసమాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఏ డెబ్యూ హీరో కూడా సాధించని విధంగా ఆయన ఈ సినిమాతో వసూళ్ల సునామీ నీ సృష్టించారు. తన నటన తో, డాన్స్ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి భారీ స్థాయిలో వారి అభిమానాన్ని పొందాడు.  ఆ విధంగా ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆయన రెండవ సినిమాగా రూపొందిన కొండ పొలం సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరచడంతో ఆయన పై ఒత్తిడి ఎంతో పెరిగిపోయింది. దాంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి ఎంతో సమయాన్ని తీసుకొని ఇప్పుడు రంగ రంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరిశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ శుక్రవారం సినిమా విడుదల జరిగింది. లవ్ అండ్ రొమాంటిక్  ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ అందరిలో ఎంతో ఆసక్తిని కలిగించింది. పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎంతో బాగా పండింది అని అప్పట్లో చెప్పుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా మరి సెప్టెంబర్ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై  ఈ సినిమా హీరో వైష్ణవ తేజ్ కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని అందరు అనుకున్నారు.  ఈ సినిమా ద్వారా విజయాన్ని అందుకుని తనపై వచ్చిన విమర్శలున్నటికి సమాధానం చెప్పాలని వైష్ణవ తేజ్ భావించాడు. కానీ సినిమా యొక్క కంటెంట్ బాగా లేకపోవడం సినిమా ఈ స్థాయి లో పోవడానికి కారణం అయ్యింది. ఈ సినిమాను బాపినీడు సమర్పణ లో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: