పవన్ కళ్యాణ్ 'జల్సా 4కే' వెర్షన్ కి నైజాం ఏరియా లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లు ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉన్న ఎన్నో విజయవంతమైన మూవీ లలో జల్సా మూవీ ఒకటి. జల్సా మూవీ 2 ఏప్రిల్ 2008 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి , కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ,  గోవా బ్యూటీ ఇలియానా , పార్వతి మిల్టన్ , కమిలిని ముఖర్జీ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. జల్సా మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు ఇలియానా , పార్వతి మెల్టన్ ,  కమలిని ముఖర్జీలకు అలాగే దేవి శ్రీ ప్రసాద్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.  

ఇలా 2008 వ సంవత్సరంలో విడుదల అయ్యి అప్పట్లో  బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న జల్సా మూవీ ని తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పుట్టిన రోజు కంటే ఒక రోజు ముందుగా అనగా సెప్టెంబర్ 1 వ తేదీన ఈ మూవీ 4 కే వర్షన్ ని ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ మూవీ 4 కే వర్షన్ కి చాలా మంచి క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే జల్సా మూవీ 4 కే వర్షన్ నైజాం ఏరియాలో 1.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. జల్సా మూవీ రీ రిలీస్ లో భాగంగా ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: