హిట్ స్టేటస్ కి అన్ని కోట్ల దూరంలో ఉన్న 'లైగర్' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా పాన్ ఇండియా మూవీ లైగర్ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీలో మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా , రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా మంచి క్రేజీ లభించింది. ఈ మూవీపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకొని ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ 90 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కడం లేదు. ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 25.83 కోట్ల షేర్ , 54.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ బ్రేక్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ని అందుకోవాలి అంటే ఇంకా 64.17 కోట్ల షేర్ కలక్షలను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: