బర్త్ డే స్పెషల్: నాగార్జున ఎంతో ఇష్టపడి తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..  ఈయన తన సినీ కెరియర్ లోనే ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోలను పరిచయం చేసిన హీరో కూడా ఈయనే అని చెప్పాలి.అయితే  అంతేకాదు కొత్త టాలెంట్ ను వెలికి తీసి మరి అవకాశాలు ఇచ్చే పనిలో ఉంటారు నాగార్జున.  ఎంతో మంది దర్శకులను సైతం తెలుగు తెలుపు పరిచయం చేశారు నాగార్జున. పోతే ఇటీవల ఏమైనా నటించిన బంగార్రాజు సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ది ఘోస్ట్ , బ్రహ్మాస్త్ర సినిమాలతో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు నాగార్జున.

నాగార్జున హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం క్రిమినల్.  బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ తెలుగులో డైరెక్షన్ చేసిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే  నాగార్జున ఎంతో ఇష్టపడి నటించిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ క్రిమినల్ సినిమాలో నాగార్జున డాక్టర్ అజయ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ప్యుజిటివ్ అనే ఇంగ్లీష్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.కాగా  క్రిమినల్ సినిమాలో నటించేటప్పుడు.. మరో సినిమాలో నటించే అవకాశం ఉన్నా సరే నాగార్జున ఈ సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. 

ఇకపోతే  ఎంతో ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు నాగార్జున.ఇందులో కీరవాణి మ్యూజిక్ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.  ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఇక  దీంతో నాగార్జున కూడా పూర్తిగా హర్ట్ అయ్యారని సమాచారం.ఇక నాగార్జున ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: