డిజాస్టర్ టాక్ తోనే అక్కడ 'పుష్ప' రికార్డును బ్రేక్ చేసిన లైగర్..?

Anilkumar
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'.ఈ సినిమాలో  అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే మైక్ టైసన్ 'లైగర్' తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక  భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో తడబడిందనే చెప్పాలి. టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.కాగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ దాదాపు రూ.10 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక హిందీలో అయితే ఈ చిత్రం సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.పోతే  అక్కడ ఈ మూవీ ఏకంగా అల్లు అర్జున్ 'పుష్ప'('పుష్ప' ది రైజ్) డే1 కలెక్షన్లనే బ్రేక్ చేయడం ట్రేడ్ కు సైతం షాకిచ్చే అంశం. కాగా 'లైగర్' చిత్రం హిందీ బెల్ట్ లో తొలి రోజు రూ.4.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ పండితుల సమాచారం.అయితే పెయిడ్ ప్రీమియర్స్ కలపకుండా వచ్చిన నెంబర్లు ఇవని తెలుస్తుంది. ఇక అవి కూడా కలుపుకుంటే రూ.6 కోట్ల నుండి రూ.7 కోట్ల మధ్య గ్రాస్ ఉంటుందని అంచనా.కాగా  'పుష్ప' చిత్రం మొదటి రోజు గ్రాస్ అక్కడ రూ.3 కోట్ల లోపే ఉంది.

అయితే ఇక  'లైగర్' చిత్రం నెగిటివ్ టాక్ తో కూడా 'పుష్ప' రికార్డ్ ను బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు రెండో రోజు కూడా హిందీలో ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఇకపోతే ముఖ్యంగా అక్కడి మాస్ ఏరియాల్లో 'లైగర్' బాగా కలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.అయితే  దీనిని బట్టి విజయ్ దేవరకొండ కి నార్త్ లో క్రేజ్ పీక్స్ లో ఉందని స్పష్టమవుతుంది.ఇక  ఫుల్ రన్లో 'లైగర్' అక్కడ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా విజయ్- పూరి ల నెక్స్ట్ మూవీ 'జన గణ మన' కి కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: