ఆ సీక్వెల్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న నాని..?

Anilkumar
నేచురల్ స్టార్ నాని గురించి పరిచయం అవరసం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఇదిలావుంటే ఇక ఇప్పుడు  'దసరా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.అయితే  ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.ఇక  వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తోన్న నాని.. మరోపక్క సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు.

కాగా నాని తన బ్యానర్ లో నిర్మించిన 'హిట్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించారు.అయితే  విశ్వక్ కెరీర్ లో ఇదొక మంచి హిట్ గా నిలిచింది. ఇక దీంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు నాని.పోతే  సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ నటిస్తాడని అనుకున్నారు.అడివి శేష్ ను ఆన్ బోర్డ్ చేశారు.ఇక  'హిట్' సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన దర్శకుడు శైలేష్ కోనేరు.. హిందీలో రీమేక్ చేశారు. ఇదిలావుంటే రీసెంట్ గా హిందీ వెర్షన్ రిలీజయింది.ఇకపోతే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇదిలా ఉండగా.. తెలుగులో సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది.

అయితే  ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ కాకుండానే 'హిట్3' కూడా ఉంటుందని అంటున్నారు. కాగా ఈసారి నిర్మాతగా ఉన్న నాని లీడ్ రోల్ పోషిస్తారని టాక్. అయితే దర్శకుడు శైలేష్ కోనేరు నాని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా 'హిట్3' కథ రాయబోతున్నారట.పోతే క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో నాని బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.కాగా  తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు.అయితే  ఇప్పుడు నాని కూడా 'హిట్3'తో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: