'ఆర్ సి 15' మరియు 'ఇండియన్ 2' మూవీల గురించి ఆసక్తికరమైన అప్డేట్ తెలియజేసిన శంకర్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా , సునీల్, అంజలి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్, రామ్ చరణ్ తో మూవీ కంటే ముందు కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ ఆగిపోయింది. దానితో ఎంత కాలం అయినా ఇండియన్ 2 మూవీ తిరిగి ప్రారంభం కాకపోవడంతో శంకర్ , రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే తిరిగి దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' మూవీ ని ప్రారంభించాడు.  

దానితో రామ్ చరణ్ , శంకర్ మూవీ  కొంతకాలం పాటు ఆగిపోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలన్నింటికి దర్శకుడు శంకర్ తాజాగా ఫులిస్టాప్ పెట్టాడు. శంకర్ సోషల్ మీడియా వేదికగా ఆర్ సి 15 మరియు ఇండియన్ 2 మూవీలు రెండు షూటింగ్ లు కూడా సమానంగా జరుగుతాయి అని , అలాగే ఆర్ సి 15 షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ మరియు వైజాగ్ లో జరుగుతుంది అని శంకర్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: