వశిష్ట: ఒక్క సినిమాతో కోట్లలో రెమ్యూనరేషన్?

Purushottham Vinay
వశిష్ట.. ఇక ఈ మధ్య కాస్త గట్టిగా వినిపిస్తున్న దర్శకుడి పేరు. `బింబిసార` సినిమాకు ముందు విశిష్టని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. సినిమా వచ్చాక చూద్దాంలే అని అందరూ కూడా అనుకొన్నారు.తీరా బింబిసార సినిమా వచ్చింది. పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇది ఇప్పుడు ఒక మినీ బాహుబలి అని అందరూ కొనియాడుతున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో ఓ సోషియో ఫాంటసీ సినిమాని భలే తీశాడ్రా అనిపించింది ఈ సినిమా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వశిష్ట గురించి చాలా గొప్పగా చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. అయితే వశిష్ట ప్రతిభకు బింబిసార కేవలం ట్రైలర్ మాత్రమే అని, ముందు ముందు సినిమా చూపించేస్తాడని, చాలా గొప్ప దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పాడు ఎన్టీఆర్‌. `ఎంతైనా సొంత అన్న సినిమా కదా.. ఎన్టీఆర్ ఆ మాత్రం పొగడక తప్పదులే` అనుకొన్నారు జనాలు. కానీ. వశిష్ట ఆ మాటలకు ఖచ్చితంగా అర్హుడని నిరూపించుకొన్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే గీతా ఆర్ట్స్ వశిష్టకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.


ఇప్పుడు మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా భారీ అడ్వాన్సులతో.. వశిష్ట చుట్టూ తిరుగుతున్నా, `బింబిసార 2` సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ సినిమా అయ్యేంత వరకూ కూడా అడ్వాన్సులు తీసుకోను అని తెగేసి చెబుతున్నాడట.ఇక బింబిసార సినిమాకి వశిష్ట అందుకొన్న పారితోషికం అతి స్వల్పం. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి అతను కేవలం నెలవారీ జీతం పుచ్చుకొన్నాడు. అయితే బింబిసార సినిమా హిట్టయి, భారీ లాభాలు రావడంతో.. చెప్పుకోదగిన మొత్తంలో పారితోషికం కూడా ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ 2 సినిమాకి మాత్రం వశిష్ట ఏకంగా రూ.3 కోట్లు అందుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ కూడా ఏకంగా రూ.3 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు ఒక్క సినిమాతోనే ఏకంగా రూ.3 కోట్ల పారితోషికం అందుకోవడం.. గొప్ప విశేషమే. ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని.. వశిష్ట నిలబెట్టుకొన్నట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: