'లైగర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో ఈ మూవీ లో నటించాడు. ఈ మూవీ లో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి అద్భుతమైన ప్రీ రిలీజ్ కూడా జరిగింది. 

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం. నైజాం : 25 కోట్లు , సీడెడ్ : 9 కోట్లు ,  యూ ఏ : 7.5 కోట్లు , ఈస్ట్ : 5 కోట్లు , వెస్ట్ : 3.8 కోట్లు , గుంటూర్ : 5.2 కోట్లు , కృష్ణ : 4.3 కోట్లు , నెల్లూర్ : 2.2 కోట్లు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లైగర్ మూవీ 62 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. కర్ణాటక : 5.20 కోట్లు , తమిళ్ : 2.5 కోట్లు , కేరళ : 1.20.కోట్లు , ఓవర్ సీస్ లో :  7.50 కోట్లు , నార్త్ ఇండియా లో :  10 కోట్లు , ప్రపంచ వ్యాప్తంగా లైగర్ మూవీ 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: