ఆ బాలీవుడ్ నటి అంటే నాకు చాలా ఇష్టం... నాగ చైతన్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . అందులో ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో నాగ చైతన్య బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు . ఇలా ఉంటే పోయిన నెల అనగా జూలై 22 వ తేదీన నాగ చైతన్య , విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . థాంక్యూ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది .

దానితో చివరగా థాంక్యూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది . అలాగే ఈ నెల అనగా ఆగస్ట్ 11 వ తేదీన అమీర్ ఖాన్ హీరో గా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు . ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగ చైతన్య తనకు ఇష్టమైన నటి గురించి చెప్పు కొచ్చాడు. బాలీవుడ్ నటి మరియు మాజీ మిస్ యూనివర్స్ అయి నటు వంటి సుస్మితా సేన్ అంటే తనకు ఎంతో ఇష్టమని తాజాగా నాగ చైతన్య చెప్పు కొచ్చాడు. ఇదే విషయాన్ని ఆమె కలిసినప్పుడు కూడా చెప్పాను అని నాగ చైతన్య తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: