కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్.. చివరికి అలా?
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హిట్ ఇచ్చిన ఒక హీరోయిన్ కూడా ఇలాగే ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది అని చెప్పాలి. ప్రస్తుతం తాతకు తగ్గ మనవడిగా కళ్యాణ్‌రామ్ కొనసాగుతున్నారు. ఒకవైపు హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకులకు లైఫ్ కూడా ఇస్తున్నారు. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమా వచ్చింది. ఇక అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సింధుతులాని నటించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ సినిమా కథ డైరెక్టర్ టేకింగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టాడు. అదే సమయంలో సింధుతులాని అభినయం కూడా ఈ సినిమాకి ఎంతగానో ప్లస్ అయింది అని చెప్పాలి. దీంతో ఇక ఆమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం అని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు తమిళంలో శింబు హీరోగా వచ్చిన మన్మధ సినిమాలో నటించింది. అది కూడా సూపర్ హిట్. కానీ అక్కడ అవకాశాలు రాలేదు. అయితే ఇలా సింధుతులానీ అవకాశాలు లేక హీరోయిన్గా కనుమరుగు కావడానికి కారణం పెద్ద హీరోలకు సరిపడా హైట్ పర్సనాలిటీ లుక్ లేక పోవడం అనేది తెలుస్తుంది. ఇలా హీరోయిన్ గా కొనసాగడానికి టాలెంట్ ఉంటే సరిపోదు ఎక్స్ ట్రా క్వాలిటీస్ కూడా ఉండాలి అన్నది ఈ హీరోయిన్ విషయంలో నిజమైందని కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు.