కార్తీకదీపం సీరియల్ చూసేవారికి గుడ్ న్యూస్.. వంటలక్క రీ ఎంట్రీ వీడియో వైరల్..!!

Divya
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క కోసమే జనాలు ఈ సీరియల్ ని విపరీతంగా చూస్తూ ఉంటారు. అయితే ఒక రోడ్డు ప్రమాదంలో వీరు చనిపోయినట్లు చూపించడం రేటింగ్ తో పాటు, ప్రేక్షకులకు ఈ సీరియల్ అంతగా నచ్చలేదు. ఇక అంతే కాకుండా డాక్టర్ బాబు వంటలక్క పిల్లలు కూడా పెద్దవారు అయ్యేలా చూపించారు అయితే ఈ సీరియల్ మాత్రం పెద్దగా జనాలను ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే దారుణమైన రేటింగ్ రావడంతో ఈ సీరియల్ ప్రొడక్షన్ టీమ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తాజాగా ఇప్పుడు వంట లక్క కు సంబంధించి ఒక వీడియోని విడుదల చేశారు.
ఇక ఆ వీడియోలో వంటలక్క కోమాలో నుంచి వస్తున్నట్లుగా ఒక ప్రోమోని విడుదల చేయడం జరిగింది దీంతో ఫ్యాన్స్ అంతా చాలా సంబరపడిపోతున్నారు కోమాలో నుంచి వచ్చిన వంటలక్క ఆ వెంటనే డాక్టర్ బాబు అంటూ కలవరించడం కూడా మనకి ఈ ప్రోమోలో కనిపిస్తుంది. మొత్తానికి దారుణమైన రేటింగ్స్ తో నెట్టుకొస్తున్న ఈ కార్తీకదీపం సీరియల్ కు డైరెక్టర్ సరికొత్త ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ ప్రోమోత జనాల్లో ఆసక్తి రేపిన స్టార్ మా యాజమాన్యం మరల రేటింగ్ లో అగ్రస్థానాన్ని అందుకుంటుందేమో చూడాలి అయితే ఈ క్రమంలో వీరిద్దరి ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది యాజమాన్యం. మరి వీరితో పాటుగా మోనిత కూడా  రీఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. ఇక ఈ విషయంలో ఇంతవరకు అయితే ఏ విధమైన క్లారిటీ రాలేదు. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం వంటలక్క, డాక్టర్ బాబు , మోనిత ఇలా అందరూ తిరిగి వస్తారని భావిస్తున్నారు దీంతో మొత్తానికి కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క మరొకసారి తన హవాచూపించేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: